Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రిస్‌మస్‌కు ఈ ఏడాది కూడా మిస్ అవుతున్నా: సమంత

క్రిస్‌మస్‌కు ఈ ఏడాది కూడా మిస్ అవుతున్నా: సమంత
, శుక్రవారం, 19 డిశెంబరు 2014 (16:54 IST)
సమంత ఈ ఏడాది కూడా క్రిస్‌మస్ పండుగను హ్యాపీగా జరుపుకోలేకపోతున్నానని చెన్నై సోయగం సమంత బాధపడుతోంది. సమంతాకి ప్రస్తుతం లాస్ట్ ఇయర్ అనుభవమే రిపీట్ అవుతోంది. గత సంవత్సరం అమ్మడు ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా వుండడం వల్ల క్రిస్మస్ పండుగను చేసుకోలేకపోయింది. 
 
ఆ సమయానికి షూటింగులోనే ఉండిపోయింది. అయితే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతోందట. ఈ ఏడాది కూడా షూటింగుల కారణంగా పండుగ మిస్ అవుతున్నానని సమంత చెబుతోంది. మామూలుగా క్రిస్ మస్ అంటే చాలా హడావుడి చేస్తానని, సినిమాల్లోకి వచ్చాక మాత్రం పండుగలు చేసుకోవడం ఏమాత్రం కుదరట్లేదని సమంత వాపోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu