Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరోలే చేయాలా.. నేనూ డబుల్ యాక్షన్ చేస్తున్నా: సమంత

హీరోలే చేయాలా.. నేనూ డబుల్ యాక్షన్ చేస్తున్నా: సమంత
, బుధవారం, 22 ఏప్రియల్ 2015 (14:52 IST)
హీరోలతో ధీటుగా నటించేందుకు సమంత సై అంటోంది. హీరోలే డబుల్ యాక్షన్ చేస్తారా..? తానూ డ్యుయెల్ రోల్ చేస్తానని సమంత చెబుతోంది. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో టాప్ హీరోయిన్‌గా నిలిచిన సమంత ''10 ఎండ్రత్తుకుల్ల'' (పది లెక్కించే లోపు) సినిమా ద్విపాత్రాభినయం చేస్తోంది. విజయ్ మిల్టన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ''ఐ'' హీరో విక్రమ్ సరసన సమంత నటిస్తోంది. 
 
చియాన్ విక్రమ్‌తో జోడీగా సమంత భిన్న పాత్రల్లో కనిపించనుంది. అందులో ఒక నేపాలీ రోల్‌గా, రెండోది మోడ్రన్ రోల్‌గా చేస్తుందని సమాచారం. ఇటీవలే విక్రమ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో ''10 ఎండ్రత్తుకుల్ల''పై అభిమానుల అంచనాలు అమాంతంగా పెరిగాయి. తాజాగా సమంత డ్యుయెల్ రోల్‌లో నటిస్తోందని తెలియడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu