Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సందీప్ కిషన్‌తో సమంత: చిన్న హీరోలతోనూ రెడీ!

సందీప్ కిషన్‌తో సమంత: చిన్న హీరోలతోనూ రెడీ!
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (12:15 IST)
సన్నాఫ్ సత్యమూర్తి రిలీజ్ అయ్యాక.. ఛాన్సులు దొరకట్లేదని.. సమంత పనైపోయిందని మీడియా కోడైకూసిన నేపథ్యంలో.. చిన్న హీరోల సరసన నటించేందుకు రెడీ అవుతోంది.

ప్రస్తుతం పెద్ద హీరోల సరసనే నటిస్తున్న చెన్నై బ్యూటీ సమంత త్వరలో యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమాలో కూడా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాను ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సందీప్ త్వరలో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసుకుంటున్నాడు. 
 
దీనికి వీవీ వినాయక్ దర్శకత్వం వహించే అవకాశం వుందని అంటున్నారు. సందీప్ మేనమామ ప్రముఖ ఛాయాగ్రాహకుడు చోటా కె. నాయుడు ఇందుకు సంబంధించి ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇందులో సమంతా కథానాయికగా నటిస్తుందని సమాచారం. ఈ సినిమా స్క్రిప్ట్ అదిరిపోయిందని తప్పకుండా మంచి హిట్ అవుతుందనే నమ్మకంతోనే చిన్న హీరో అయినా సమంత నటించేందుకు రెడీ అయ్యిందని తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu