Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిట్ అండ్ రన్ కేసు: తాగి బండి నడపలేదన్న సల్మాన్ ఖాన్!

హిట్ అండ్ రన్ కేసు: తాగి బండి నడపలేదన్న సల్మాన్ ఖాన్!
, శుక్రవారం, 27 మార్చి 2015 (20:08 IST)
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ఖాన్ ఎట్టకేలకు బోనెక్కి సరికొత్త సాక్ష్యం ఇచ్చాడు. 2002లో కారు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమై, నలుగురిని గాయపరిచారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌.. శుక్రవారం కోర్టు విచారణకు హాజరై తన వాదనను వినిపించుకున్నారు. 
 
ఆయన శుక్రవారం కోర్టు బోనులో నిలబడి తన సాక్ష్యాన్ని వినిపించారు. తుది వాదనలు ప్రారంభించేందుకు వీలుగా సల్మాన్ సాక్ష్యాన్ని నమోదు చేయాల్సిందిగా ఇటీవల కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. 
 
ఆ సమయంలో మీడియాను నిషేధించాలన్న సల్మాన్ పిటిషన్‌ను న్యాయమూర్తి దేశ్ పాండే తిరస్కరించారు. అయితే విచారణ పూర్తయ్యేవరకు వివరాలు వెల్లడి చేయొద్దని మీడియాను కోరారు.
 
కాగా 2002లో మద్యం మత్తులో కారు నడిపి ఫుట్పాత్ మీద నిద్రిస్తున్నఒకరు మరణించడానికి, నలుగురు గాయపడేందుకు కారణమైన కేసులో సల్మాన్ ఖాన్ నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే సల్మాన్ కారు నడిపినట్లు ప్రాంతీయ రవాణా అధికారి ఒకరు ముంబై సెషన్స్ కోర్టుకు నివేదించారు. 

Share this Story:

Follow Webdunia telugu