Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సల్మాన్ హిట్ అండ్ రన్‌ కేసు.. మే 6న తుది తీర్పు..!

సల్మాన్ హిట్ అండ్ రన్‌ కేసు.. మే 6న తుది తీర్పు..!
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (14:09 IST)
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై ఉన్న 'హిట్ అండ్ రన్' కేసులో తుది తీర్పు మే నెల ఆరో తేదిన వెల్లడికానుంది. గత 2002లో సెప్టెంబర్ 28వ తేదిన రాత్రి మద్యం సేవించి కారు నడిపిన సల్మాన్ ఖాన్ రోడ్డు పక్కన పడుకుని ఉన్న కూలీలపై ఎక్కించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
 
ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ కేసు సోమవారం విచారణకు రాగా డిఫెన్స్, ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదుల తుది వాదనలు ముగిసాయి. దీంతో ఈ కేసులో తుది తీర్పును మే నెల ఆరో తేది ప్రకటిస్తామని న్యాయమూర్తి డి.డబ్ల్యూ దేశ్ పాండే వెల్లడించారు. కాగా ఈ కేసులో సల్మాన్ దోషిగా తేలితే దాదాపు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu