Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచిన్ జోషి హీరోగా 'హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్'

సచిన్ జోషి హీరోగా 'హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్'
, గురువారం, 18 డిశెంబరు 2014 (18:10 IST)
హిందీలో 'ఆజాన్', 'ముంబై మిర్రర్', 'జాక్ పాట్' వంటి చిత్రాలతో హీరోగా, నిర్మాతగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు సచిన్ జోషి. తొలిసారిగా ఒక బయట నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం 'హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్'లో హీరోగా నటిస్తున్నారు. అయుష్ రైనా ఈ సినిమాకు దర్శకుడు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో అతీంద్రియ శక్తుల నేపధ్యంలో ప్రవల్ రామన్ ఈ చిత్ర కథను రాశారు.
 
'మౌనమేలనోయి', 'నిను చూడక నేనుండలేను', 'ఒరేయ్ పండు' చిత్రాలతో సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'ఆషికీ 2'ను తెలుగులో 'నీ జతగా నేనుండాలి' పేరుతో రీమేక్ చేశారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పటివరకూ సోలో హీరోగా నటించిన సచిన్ జోషి 'హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
  
ఈ సందర్భంగా సచిన్ జోషి మాట్లాడుతూ.. తొలిసారి ఒకరు స్క్రిప్టుతో నా వద్దకు వచ్చి ఒక పాత్రలో నటించాలి అని అడుగగానే నేను ఆశ్చర్యపోయాను. 'హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్' సినిమాలో నేను సూరజ్ వాద్వా అనే బాగా ధనవంతుడైన పారిశ్రామికవేత్తగా కనిపిస్తాను. ఎల్లప్పుడూ చుట్టూ బాడీగార్డ్స్ ఉంటారు. విలాసవంతమైన జీవితం గడిపే ఒక యువకుడు. నా ప్రతి సినిమాలో హీరోగా నటిస్తూ.. నిర్మాణ పరంగా నేను కీలక నిర్ణయాలు తీసుకునేవాడిని. తొలిసారిగా దర్శకుడి సూచనలను ఫాలో అవ్వడానికి సిద్ధమయ్యాను. ఇదొక కొత్త అనుభూతి అని సచిన్ జోషి అన్నారు.
 
సచిన్ జోషి భార్య రైనా జోషి పుట్టినరోజు వేడుకలలో దర్శక రచయితలు ఆయుష్ రైనా, ప్రవల్ రామన్‌ను ఈ హీరోను చూశారు. తమ కథలో సూరజ్ వాద్వా పాత్రకు సచిన్ జోషి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడని భావించడం, తర్వాత అతనితో కలసి మాట్లాడడం జరిగాయి. సచిన్ జోషి వెంటనే 'హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్'లో నటించడానికి అంగీకరించడంతో ఆయుష్ రైనా, ప్రవల్ రామన్‌లు సంతోషం వ్యక్తం చేశారు. హిందీ, తెలుగు భాషలలో 'హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్' సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu