Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమాల నుంచి తీసినవే షార్ట్‌ ఫిలింస్‌: దర్శకుడు సుజీత

సినిమాల నుంచి తీసినవే షార్ట్‌ ఫిలింస్‌: దర్శకుడు సుజీత
, శనివారం, 26 జులై 2014 (17:07 IST)
షార్ట్‌ ఫిలింస్‌ అంటే వేరే చిత్రాల నుంచి కొన్నింటిని లేపేసి ఆకర్షణీయంగా చూపించడమేనని దర్శకుడిగా మారిన సుజీత్‌ తెలియజేస్తున్నారు. పలు షార్ట్‌ ఫిలింస్‌ తీసిన ఆయన తొలిసారిగా  'మిర్చి' నిర్మాతలు నిర్మిస్తున్న రన్‌ రాజా రన్‌కు దర్శకుడు. శర్వానంద్‌ నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. త్వరలో విడుదలవుతున్న ఈ సినిమా గురించి దర్శకుడు ఈ విధంగా తెలియజేస్తున్నారు.
 
స్కూల్‌ విద్యాభ్యాసం అనంతపూర్‌లో జరిగింది. అప్పటినుంచి తోటివారికి కథలు చెప్పడం అలవాటు. కాలేజీ చెన్నైలో చదివాను. అనంతరం హైదరాబాద్‌ వచ్చాక ఆ కథల్ని డాక్యుమెంటరీలుగా తీస్తే ఎలా వుంటుందనే ఆలోచనలో పలువురికి కథలు ఇవ్వడం జరిగింది. కానీ వారు సరిగ్గా తీయలేకపోవడంతో... షార్ట్‌ఫిలిం నేనే తీయాలని కొన్ని తీశాను.
 
చెన్నైలో ఉండగా లక్స్‌, బనియన్‌ వంటి పలు వ్యాపార ప్రకటనలను అసిస్టెంట్‌ దర్శకుడిగా పని చేసిన అనుభవం దీనికి వుపయోగపడింది. 'మిర్చి' సినిమాను చూశాక కొత్తగా కథ రాయడం నేర్చుకుని ఆ నిర్మాతలను కలవడం. వెంటనే కథ అడగడం వారు విని.. మెచ్చుకోవడం జరిగిందని తెలిపారు. రెండేళ్ళనాడు సంఘమిత్ర ఆర్ట్స్‌ బేనర్‌లో సినిమా ఆరంభించి తప్పుకున్నానని తెలిపారు. 
 
రన్‌ రాజా రన్‌లో కథానాయకుడు సత్యహరిశంద్రుడు లాంటివాడు. ఆయన వ్యక్తిత్వానికి అమ్మాయిలు దూరమవుతుంటారు. ఆయన పాత్ర హైలెట్‌గా ఉంటుంది. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. జీరో స్థాయి నుంచి హీరోగా ఎలా ఎదిగాడనేది చిత్రంలో ఆసక్తికర అంశం. ఈ చిత్రానికి 'విశ్వరూపం' చిత్రానికి బాణీలు అందించిన జిబ్రోస్‌ సంగీతాన్ని అందించడం ప్రత్యేకతగా పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu