Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయాలు, సినిమాల్లోనూ మంచి చేస్తేనే పేరు: చంద్రబాబు

రాజకీయాలు, సినిమాల్లోనూ మంచి చేస్తేనే పేరు: చంద్రబాబు
, బుధవారం, 17 సెప్టెంబరు 2014 (20:04 IST)
రాజకీయాల్లో ఒక మంచి పనిచేస్తే మంచి అభిమానం వస్తుంది. సినిమాలు కూడా ఓ మంచి చిత్రం చేస్తే అందరి అభిమానం పొందుతారు.. అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నారా రోహిత్‌ చిత్రం 'రౌడీ ఫెలో' చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్నారు. గత రాత్రి ఇది శిల్పకళావేదికలో జరిగింది. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సినిమాల్లో వినోదంతో పాటు సందేశం కూడా వుండాలి. అప్పుడే సమాజానికి మంచి జరుగుతుంది. ఇప్పుడు  వస్తున్న కొన్ని చిత్రాలను చూస్తుంటే బాధేస్తుంది. వాటితో సమాజానికి ఏం చేయాలనుకున్నారో అర్థంకాదు. 
 
గతంలో ఎన్‌టిఆర్‌ జస్టిస్‌ చౌదరి వంటి చిత్రాలను తీసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. సమాజానికి ఉపయోగపడే అటువంటి చిత్రాలు రావాలి అని అన్నారు. ఎన్‌టిఆర్‌ యుగపురుడు ఇప్పటి తరానికి తెలియకపోయినా... ఆయన చరిత్ర చదివి అభిమానులైనవారు ఎందరో వున్నారు. జాతీయస్థాయిలో ఆయన పేరు తెచ్చుకున్నారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu