Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రితేశ్ దేశ్ ముఖ్-జెనీలియా సన్ రియాన్ ఫోటో అదుర్స్

రితేశ్ దేశ్ ముఖ్-జెనీలియా సన్ రియాన్ ఫోటో అదుర్స్
, బుధవారం, 27 మే 2015 (12:37 IST)
సినీ నటి జెనీలియా, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్‌ల కుమారుడు రియాన్ ఫోటోకు సోషల్ మీడియా మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలిసారి ట్విట్టర్, ఫేస్ బుక్‌లో పెట్టిన రియాన్ ఫోటోకు లైక్స్ భారీ ఎత్తున వస్తున్నాయి. తండ్రి అయినప్పటి నుంచీ రితేశ్ తన కుమారుడి విషయాలను రితేశ్ ట్విట్టర్ లో తెలుపుతూనే ఉన్నాడు. ఈసారి మాత్రం తమ ముద్దుల తనయుడు రియాన్‌ను మొదటిసారి బయటి ప్రపంచానికి చూపారు. 
 
ఆ ఫోటోల్లో చిరునవ్వులు చిందిస్తూ, ముద్దులొలుకుతూ కనిపిస్తున్న కుమారుడితో జెనీలియా దంపతులు సంతోషంగా కనిపించారు. ఇటీవలే తమ చిన్నారి ఆరు నెలలు పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. రితేశ్ దేశ్ ముఖ్, జెనీలియాలు 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2014లో నవంబర్ జెనీలియా చిన్నారికి జన్మనిచ్చింది. దాంతో వారిద్దరూ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu