Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్విట్టర్లో వాగుడుకాయ వర్మ: యాదయ్య-వెంకన్నపై సెన్సేషనల్ కామెంట్స్!

ట్విట్టర్లో వాగుడుకాయ వర్మ: యాదయ్య-వెంకన్నపై సెన్సేషనల్ కామెంట్స్!
, గురువారం, 20 నవంబరు 2014 (10:29 IST)
వాగుడుకాయ రాం గోపాల్ వర్మ మళ్లీ ట్విట్టర్ ముఖంగా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లోకెక్కే దర్శకుడు రాంగోపాల్‌వర్మ తాజాగా మరో వివాదాస్పద కామెంట్ చేశాడు.
 
తాజాగా ఆయన దేవుళ్ల మధ్య కూడా విభజన గీత తీసుకువచ్చాడు. తెలంగాణ వాళ్లకు వాళ్ల యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కంటే తిరుపతి వేంకటేశ్వరస్వామి ఎక్కువయ్యాడా అన్ని ట్వీట్ చేశాడు. 
 
తనకు దేవుడంటే నమ్మకం లేకపోయినా తెలంగాణ ప్రజలు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి కంటే తిరుపతి బాలాజీనే ఎక్కువగా పూజించడాన్ని తాను లక్ష్మీనరసింహుడికి జరిగే అవమానంగా భావిస్తానని వర్మ పేర్కొన్నాడు. 
 
మన సొంత ఊరును, సొంత దేశాన్ని ప్రేమించినట్టుగానే సొంత ప్రాంతానికి చెందిన దేవుళ్లను కూడా పూజించుకోవాలని వర్మ చెప్పాడు. తిరుపతి వెంకన్న కంటే తెలంగాణ ప్రజలు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడిని తక్కువగా తలచుకుంటారని చెప్పడం తప్పుకాదు కదా అని వర్మ ట్విట్టర్‌లో ప్రశ్నించాడు. 
 
చివరగా సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తున్నందును తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఆయన చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల తెలంగాణ ప్రజలు తమ దేవుడి విలువను తెలుసుకుంటారని వర్మ ముగించాడు. 
 
ఏదేమైనా వర్మ తన వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజల మధ్య దేవుళ్లను కూడా విభజించేశాడు. మరి దీనిపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu