Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ పేరును వాడుకోవాల్సిన అగత్యం లేదు : రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ పేరును వాడుకోవాల్సిన అగత్యం లేదు : రేణు దేశాయ్
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (13:23 IST)
తాను టాలీవుడ్ హీరో, తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ పేరును వాడుకోవాల్సిన అవసరం లేదని సినీ నటి రేణు దేశాయ్ స్పష్టం చేశారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి పవన్ కల్యాణ్ పేరు ఉపయోగించుకుంటోందని తనపై వస్తున్న ఆరోపణలపై ఆమె ఒకింత ఘాటుగానే స్పందించారు. 
 
పవన్ కళ్యాణ్‌ను పెళ్ళాడకముందే తాను నటినని, సుప్రసిద్ధ మోడల్‌నని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ముఖ్యంగా.. గత యేడాది ఎవరి సహాయ సహకారం లేకుండానే తాను స్వంతంగానే హిట్ సినిమా తీశానని ఆమె గుర్తు చేశారు.
 
అందువల్ల పవన్ పేరు వాడుకోవాల్సిన అవసరం తనకు లేదని తెలిపింది. తనపై వ్యాఖ్యలు చేసేందుకు ఉపయోగించే శక్తిని మరేదైనా సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగిస్తే మంచిదని హితవు పలికింది. పవన్ కల్యాణ్‌పై అభిమానం ఉంటే మంచిదేనని, ఆ అభిమానంతో ఇతరులను ఇబ్బంది పెట్టే మెసేజ్‌లు పంపడం సరికాదని ట్వీట్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu