Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గెస్ట్ పాత్రలో రవితేజ.. కన్నడ చిత్రంలో మాస్ స్టెప్స్...!

గెస్ట్ పాత్రలో రవితేజ.. కన్నడ చిత్రంలో మాస్ స్టెప్స్...!
, ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (12:13 IST)
సినిమాను వంద రోజులు వెండితెరపై ఆడించేందుకు దర్శక నిర్మాతలు పడరాని పాట్లు పడుతుంటారు. అందులో భాగంగా ఇతర భాషల్లో ప్రముఖ హీరోలుగా ఉన్న వారిని తమ సినిమాలలో నటింప చేస్తారు. తద్వారా సినిమాకు ఆకర్షణ కొంత మేర పెరుగుతుంది. ఈ కోవలో ఒక కన్నడ చిత్రంలో హీరో శివరాజ్‌తో పాటు ఇతర భాషల హీరోలు కొందరు నటించారు. వారిలో టాలీవుడ్ హీరో రవితేజ కూడా ఉన్నారు. 
 
టాలీవుడ్‌లో యంగ్ హీరోలతో పోటీ పడుతూ దూసుకుపోతున్న హీరో రవితేజ. ఈయన తాజాగా ఓ కన్నడ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించాడు. శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'వజ్రకాయ' సినిమాలో ఆయన ఓ పాటలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నాడు. దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రవితేజ నటించారు.
 
శనివారం జరిపిన ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్‌లో రజవితే పాల్గొన్నారు. ఇందులో శివరాజ్ కుమార్ తో కలసి ఈ పాటలో రవి మాస్ స్టెప్స్ వేశాడు. ఇంకా ఈ పాటలో తమిళ హీరో శివ కార్తికేయన్, మలయాళ హీరో దిలీప్, కన్నడ స్టార్ రవిచంద్రన్‌లు కూడా నటించారు.

Share this Story:

Follow Webdunia telugu