Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగాల్ టైగర్‌‌ను ప్రశంసలతో ముంచెత్తిన తమన్నా!

బెంగాల్ టైగర్‌‌ను ప్రశంసలతో ముంచెత్తిన తమన్నా!
, శనివారం, 31 జనవరి 2015 (14:11 IST)
మాస్ మహారాజా రవితేజపై హీరోయిన్ తమన్నా ప్రశంసల వర్షం కురిపించింది. రవితేజ కొత్త చిత్రం 'బెంగాల్ టైగర్‌'లో హీరోయిన్‌గా నటిస్తున్న తమన్నా.. శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రవితేజతో నటించాలని ఎప్పటి నుంచో కోర్కె ఉందన్నారు. ఆ ఆశ ఇప్పటికీ నెరవేరుతుందన్నారు. 
 
ముఖ్యంగా రవితేజ ఒక ఎనర్జిటిక్ హీరో, అతనిని చూడగానే మనలో కూడా ఎక్కడలేని ఉత్సాహం వస్తుందన్నారు. అందుకే రవితేజను ఎనర్జిటిక్ మాస్ హీరోగా అభివర్ణిస్తారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆయనలో టైగర్‌లో ఉండే ఎనర్జీ ఉంటుందన్నారు.
 
ఇకపోతే సంపత్ నంది దర్శకత్వంలో తాను ఒక చిత్రం (రచ్చ)లో నటించినట్టు చెప్పారు. ఆ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నానని, ఆ రోజున ఉన్నటువంటి ఆహ్లాదకర వాతావరణమే ఇపుడు కూడా ఉందని తమన్నా చెప్పారు. కాగా, చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో ప్రారంభమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu