Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాంగోపాల్ వర్మ ''గొలుసు''లో రానా నటించట్లేదట! ఎందుకబ్బా?

రాంగోపాల్ వర్మ ''గొలుసు''లో రానా నటించట్లేదట! ఎందుకబ్బా?
, బుధవారం, 29 అక్టోబరు 2014 (12:52 IST)
రాంగోపాల్ వర్మ ''గొలుసు''లో రానా నటించలేదట. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించేందుకు వర్మ రానాను సెలక్ట్ చేశాడట. అయితే రానా మాత్రం ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తేలింది. 
 
ప్రతిక్షణం వివాదాలను కొనితెచ్చుకునే రాంగోపాల్ వర్మ సినిమాలో నటించకూడదని రానా డిసైడైపోయాడని తెలిసింది. 'గొలుసు' సినిమా కథ నచ్చి ఆ సినిమాలో నటించాలని ముందుగా రానా భావించాడు. కానీ డేట్స్ ఖాళీలేకపోవడంతో వర్మ సినిమాలో నటించేది లేదని ఖరాఖండిగా చెప్పేశాడట. ఇందుకు డేట్స్ కారణం కాదని.. వర్మ వివాదాల వలలో పడటం ఎందుకని రానా మెల్లగా జారుకున్నట్లు సమాచారం. 
 
రానా ప్రస్తుతం 'బాహుబలి'తో పాటు 'బేబీ' అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో, వచ్చే ఆరు నెలల పాటు రానా కాల్ షీట్స్ ఫుల్ అయ్యాయని తెలుస్తోంది.

ఈ కారణంగా, 'గొలుసు' నుంచి రానా అయిష్టంగానే తప్పుకున్నాడని సురేష్ ప్రొడక్షన్స్ వర్గాలు అంటున్నాయి. దీంతో, రాంగోపాల్ వర్మ తన చిత్ర కథకు సరిపోయే మరో హీరో కోసం అన్వేషణలో పడ్డాడని ఫిలింనగర్ సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu