Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టంట్స్‌ చేస్తున్న రామ్‌చరణ్‌!

స్టంట్స్‌ చేస్తున్న రామ్‌చరణ్‌!
, బుధవారం, 15 ఏప్రియల్ 2015 (17:58 IST)
హీరో రామ్‌చరణ్‌ స్టంట్స్‌ చేయడం కొత్తకాదు. చైనా, థాయిఫైట్లు కూడా నేర్చుకుని గతంలో చేశాడు. తాజాగా అలాంటిదే మరో ప్రయత్నం చేస్తున్నాడట.  శ్రీను వైట్ల కాంబినేషన్‌‌లో రానున్న సినిమా ఇటీవలే మొదలైంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా ఈ చిత్ర టీం సెకండ్స్‌ షెడ్యూల్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ లేటెస్ట్‌ షెడ్యూల్‌ ఏప్రిల్‌ 22 నుండి మొదలు కానుంది. 
 
ఇందులో రామ్‌ చరణ్‌ ఓ స్టంట్‌ మాన్‌ పాత్రలో కనిపించనున్నాడు. దీనిపై ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బ్యాంకాక్‌‌లో ఉన్నాడు. అక్కడ ఫేమస్‌ ది మార్షల్‌ ఆర్ట్స్‌ స్కూల్‌‌లో జైక స్టంట్స్‌‌పైన స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు. ఇలా చేయడం కొత్తేమీకాదని.. స్టంట్స్‌ అంటే ఇష్టమని తెలియజేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu