Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూట్యూబ్ లో ‘బాల భైరవ’.. ఆ బాలుడి కోసం రాంచరణ్ ట్వీట్...!

యూట్యూబ్ లో ‘బాల భైరవ’..  ఆ బాలుడి కోసం రాంచరణ్ ట్వీట్...!
, శుక్రవారం, 6 మార్చి 2015 (12:08 IST)
టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంపై తెలుగు నేలలో నేటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ చెప్పిన షేర్‌ఖాన్ డైలాగ్స్ ఓ రేంజ్‌లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. 
 
తాజాగా ఇదే డైలాగ్స్‌ను ఓ చిన్న పిల్లాడు గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తున్నాడు. ఈ వీడియో ‘బాల భైరవ’ పేరుతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అచ్చం రాంచరణ్ చెప్పినట్టుగానే డైలాగ్స్ చెపుతూ అతడు ప్రదర్శించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయి.
 
దీనిని చూసిన రాంచరణ్ తేజ్ మైమరచిపోయాడట. ‘‘వీడియోలో ఉన్న బాలుడెవరో వెతికిపెట్టండి. అతడిని కలవాలనుంది’’ అంటూ తన అనుచరులను పురమాయించాడట. అంతటితో ఆగక ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో కూడా ఆ కుర్రాడి ఆచూకి తెలపాలని ఛెర్రీ విజ్ఞప్తి చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu