Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాయ్ లక్ష్మికి బంపర్ ఆఫర్ : బాలీవుడ్‌ అకీరాలో కీలక రోల్!

రాయ్ లక్ష్మికి బంపర్ ఆఫర్ : బాలీవుడ్‌ అకీరాలో కీలక రోల్!
, శనివారం, 18 ఏప్రియల్ 2015 (16:29 IST)
సెక్సీతార రాయ్ లక్ష్మికి బంపర్ ఆఫర్ లభించింది. దీంతో రాయ్ లక్ష్మి ప్రస్తుతం హ్యాపీ మూడ్‌లో వుంది. దక్షిణాదిన సరైన ఛాన్సులు లేకుండా కొట్టామిట్టాడుతున్న ఈ అమ్మడుకు అనుకోకుండా బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ రూపొందిస్తున్న 'అకీరా' సినిమాలో ఓ కీలక పాత్రను ఆమెకు ఇచ్చాడు. ఇప్పటికే అమ్మడు ఈ సినిమా కోసం ఓ షెడ్యూలు షూటింగ్ కూడా చేసింది. 
 
ఈ సందర్భంగా చెబుతూ, "బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో మంచి ఆఫర్ కోసం చూస్తుండగా మురుగదాస్ సార్ పిలిచి మరీ ఇచ్చారు. ఇది నాకు పెర్ఫెక్ట్, రైట్ ఎంట్రీ అవుతుంది. ఇందులో నా పాత్ర చిన్నదే అయినా మంచి గుర్తింపు దొరికే పాత్ర" అంటూ మురిసిపోతోంది. మరి, ఈ సినిమా తర్వారా బాలీవుడ్ ఛాన్సులు ఏ మేరకు వస్తాయో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu