Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నితిన్ కోసం చిరు 150వ సినిమాను పక్కనపెట్టిన పూరి...

నితిన్ కోసం చిరు 150వ సినిమాను పక్కనపెట్టిన పూరి...
, శుక్రవారం, 22 మే 2015 (14:57 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆతృతకు అడ్డుకట్ట వేశాడు దర్శకుడు పూరి జగన్నాథ్. నితిన్ హీరోగా ఆయన ఒక సినిమా తీయనున్నారు. చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ఆయన పుట్టిన రోజు ఆగస్టు 22న ప్రారంభించనున్నారు. ఈలోపు నితిన్‌తో సినిమా తీయాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నారని సన్నిహిత వర్గాల టాక్.
 
పూరి జగన్నాథ్ సొంత బేనర్‌లో నిర్మించనున్న ఈ చిత్ర స్క్రిప్ట్‌ను ఇప్పటికే ఒకే చేశారని, జూన్ 9న షూటింగ్ ప్రారంభించే అవకాశముందని సమాచారం. అంతేకాదండోయ్ ఈ సినిమాను 50 రోజుల్లోపు పూర్తి చేసి ఆగస్టు మొదటివారంలో విడుదల చేయాలని పూలి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇంక చిత్ర హీరోయిన్, నటీనటుల ఎంపిక జరగలేదని సమాచారం. 
 
పూరి, నితిన్‌ల కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన 'హార్ట్ ఎటాక్' విజయవంతమైంది. తాజాగా ఛార్మి ప్రధానపాత్రలో 'జ్యోతిలక్ష్మి' పేరుతో ఆయన సినిమా తెరకెక్కించారు. కాగా, 'ఆటోజానీ'లో పలు కీలక సన్నివేశాలు మార్చాలని చిరంజీవి సూచించడంతో పూరి జగన్నాథ్ రీవర్క్ చేస్తున్నారని సినీ వర్గాల టాక్.

Share this Story:

Follow Webdunia telugu