Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫోజులివ్వక పోవడం వల్లే దుష్ప్రచారం: అంజలి

ఫోజులివ్వక పోవడం వల్లే దుష్ప్రచారం: అంజలి
, సోమవారం, 26 జనవరి 2015 (15:48 IST)
తప్పతాగి ఓవరాక్షన్ చేసినట్లు వచ్చిన వార్తలపై నటి అంజలి స్పందించింది. మీడియా అడిగినట్టుగా ఫోజులివ్వక పోవడం వల్లే తాను మద్యం సేవించి పబ్ నిర్వాహకులను దూషించినట్టు మీడియా వార్తలను రాసిందని సినీ నటి అంజలి ఆరోపించింది. 
 
శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని తబలా పబ్‌కు బాగా పొద్దు పోయిన తర్వాత తన స్నేహితులతో కలిసి వెళ్లిన అంజలి.. పూటుగా మద్యం సేవించి.. పబ్ నిర్వాహకులను నోటికోచ్చినట్టుగా దూషించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ఆదివారం వివరణ ఇచ్చారు. 
 
హైదరాబాదులోని ఒక పబ్‌లో తాను మద్యం తాగి గొడవ చేసినట్టు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆరోజు తాను స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల నిమిత్తం రాత్రి 9 గంటల సమయంలో పబ్‌కు వెళ్లానని, ఒక అరగంట మాత్రమే గడిపి వచ్చేశానని ఆమె స్పష్టం చేశారు. అడిగిన విధంగా మీడియాకు ఫోజులు ఇవ్వనందునే తనపై కొందరు ఆరోపణలు ప్రచారం చేశారని ఆరోపించారు. 
 
తానూ ఆ రోజు తాగలేదని, తన పక్కనే ఎవరూ బాయ్ ఫ్రెండ్ లేడని తెలిపారు. సాక్ష్యం కోసం సీసీ టీవీ ఫుటేజ్ చూడాలని ఆమె కోరారు. కాగా, శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి పూటుగా మద్యం సేవించి, పబ్ నిర్వాహకులను నోటికొచ్చినట్టుగా తిట్టిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu