Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను బాగా అందంగా ఉన్నా.. అదుపు చేసుకోలేకపోతున్నా... ప్రియాంక

నేను బాగా అందంగా ఉన్నా.. అదుపు చేసుకోలేకపోతున్నా... ప్రియాంక
, సోమవారం, 24 నవంబరు 2014 (15:54 IST)
అమ్మాయిలు అందంగా వుండాలని అనుకుంటారు. సినిమా ఫీల్డుకు ఇది చాలా కీలకం. లేకపోతే హీరోయిన్లు రాణించలేరు. అప్పుడెప్పుడో అతడు సినిమాలో నటి త్రిష ఓ డైలాగ్‌ కొడుతుంది. దేవుడా... ఎందుకయ్యా ఇంత అందంగా పుట్టించావు' అంటూ డైలాగ్‌ కొట్టి.. అందర్నీ నవ్విస్తుంది. ఇప్పుడు  అలాంటి డైలాగే... బాలీవుడ్‌ భామ ప్రియాంక చోప్రా అంటోంది. 
 
ఇటీవలే ట్వీట్‌లో పేర్కొంది. నేను మామూలుగా పుట్టి వుంటే ఏ సమస్యా వుండేది కాదు. అందంగా వుండటంతో అన్నీ ఇబ్బందులే. ఎక్కువసేపు మేకప్‌ సరిచూసుకోవాలి. దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదిపడితే అది తినకూడదు. నోటి రుచిని అదుపు చేసుకోవాలి. అవన్నీ చూసుకోవాలంటే చిరాకేస్తుంది.. అంటూ రాసింది. 
 
ఇది చదివి ఆమె ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోవడం సరే.. బాలీవుడ్‌ హీరోయిన్లు అయితే.. ఆమె చెప్పింది కరెక్టే. అందాన్ని కాపాడుకోవడం మామూలు విషయంకాదు అంటూ వంత పాడుతున్నారు. కోట్లు సంపాదించినా మనశ్శాంతి లేదంటే ఇదే కాబోలు.

Share this Story:

Follow Webdunia telugu