Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హమ్మయ్య.. ఇన్నాళ్లకు మళ్లీ ఛాన్స్..! ఆ కోరిక తీరేనా..?

హమ్మయ్య.. ఇన్నాళ్లకు మళ్లీ ఛాన్స్..! ఆ కోరిక తీరేనా..?
, సోమవారం, 30 మార్చి 2015 (12:35 IST)
ఆ మధ్య తెలుగు, తమిళ చిత్రాల్లో క్రేజీ బ్యూటీగా వెలిగిన అందాల తార ప్రియమణి. అయితే గత కొంత కాలంగా టాలీవుడ్, కోలీవుడ్ లకు దూరంగా ఉంటున్న అమ్మడుకి ఇన్నాళ్లకు మళ్లీ ఛాన్స్ వచ్చింది. దీంతో అడిగీ అడగ్గానే ఓకే చెప్పింది. 
 
ప్రముఖ తమిళ దర్శకుడు రామ్ హీరోగా నటించే చిత్రంలో ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తుంది. విశేషం ఏమిటంటే, ప్రముఖ తమిళ దర్శకుడు, రచయిత మిస్కిన్ దీనికి కథను సమకూర్చడమే కాకుండా, ఇందులో విలన్ పాత్రను కూడా పోషిస్తున్నాడు. 
 
మిస్కిన్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన జీఆర్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. చాలా కాలం తర్వాత మళ్లీ తమిళంలో నటిస్తున్నందుకు అమ్మడు హ్యాపీగా వుంది. దీంతో మళ్లీ తెలుగు ఛాన్సులు కూడా వస్తాయని ప్రియమణి ఆశపడుతోంది. ఆమె కోరిక తీరాలని కోరుకుందాం.

Share this Story:

Follow Webdunia telugu