Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ప్రయోగం' దర్శకుని కొత్తచిత్రం

'ప్రయోగం' దర్శకుని కొత్తచిత్రం
, సోమవారం, 21 జులై 2014 (19:34 IST)
'ప్రయోగం' వంటి కొత్త కాన్సెప్ట్‌తో చిత్రానికి దర్శకత్వం వహించిన భాను ప్రకాష్‌ బలుసు కొంత గ్యాప్‌ తీసుకుని తాజాగా రూపొందిస్తున్న చిత్రం సోమవారంనాడు ప్రారంభమైంది. కార్తీక డ్రీమ్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి. ఉమాకాంత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'హ్యాపీడేస్‌' రాహుల్‌, సంయుక్త, అభా సింఘాల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... కథను అనుకున్నప్పుడే రాహుల్‌ పాత్రకు సరిపోతాడని అనిపించింది. 
 
హ్యాపీడేస్‌లో భిన్నమైన పాత్రను పోషించాడు. ఇందులో అతని పాత్ర కొత్తతరహాలో ఉంటుంది. కథ ప్రకారం ఇద్దరు కథానాయికలు కావాలి. 'ఉలవచారు బిర్యానీ'లో నటించిన సంయుక్త ఒకరు కాగా, అభా సింఘాల్‌ మరో నటిని ఎంపిక చేశాం. పూర్తిగా ఫ్యామిలీ నేపథ్యంలో సాగే ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమిది. నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. మూడు షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని' అన్నారు.
 
రాహుల్‌ తెలుపుతూ... హ్యాపీడేస్‌ తర్వాత మళ్ళీ అంత మంచి సినిమా రాలేదు. ఈ చిత్రం దాన్ని మరిపిస్తుందనే నమ్మకముందని పేర్కొన్నారు. కథ చెప్పినప్పుడే చాలాసార్లు నవ్వుకున్నామనీ, ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని కథానాయికలు వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు కనకేష్‌ రాథోడ్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే పాటల రికార్డింగ్‌ పూర్తయింది. ప్రముఖ గాయనీగాయకులు ఇందులో పాటలు పాడుతున్నారు. వినసొంపైన బాణీలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో నటిస్తున్న జాకీ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: టి. సురేందర్‌రెడ్డి.

Share this Story:

Follow Webdunia telugu