Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్వేతబసు రెస్క్యూ సెంటర్లో ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది.. బతకనివ్వండి: సునీతాకృష్ణన్

శ్వేతబసు రెస్క్యూ సెంటర్లో ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది.. బతకనివ్వండి: సునీతాకృష్ణన్
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (14:43 IST)
శ్వేతబసు ప్రసాద్.. ఈ పేరు ప్రస్తుతం తెగ పాపులర్ అయ్యింది. తప్పు చేసేసిందని మీడియాలు బాగా ఫోకస్ చేశాయి. సెక్స్ రాకెట్లో శ్వేతబసును మాత్రం అరెస్ట్ చేసి రెస్క్యూ హోంకు పంపించిన పోలీసులు.. శ్వేతతో ఉన్న నిజమైన దొంగను మాత్రం వదిలిపెట్టేసింది. అతని పేరు కూడా బయటికి పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. 
 
అయితే శ్వేతబసు రెస్క్యూ హోంకు వెళ్లినా.. అక్కడ డీలాపడి కూర్చోలేదట. పిల్లలందరికీ ఆంగ్ల పాఠాలు నేర్పించిందట. ప్రజ్వల హోంలో ఉన్నంత కాలం.. అక్కడ ఆశ్రయం పొందుతున్న పిల్లల చుట్టే శ్వేతబసు తిరిగిందట. నాటకాలలో తర్ఫీదును ఇచ్చింది. పిల్లలచేత నాటక ప్రదర్శనలు కూడా చేయించింది. 
 
థియేటర్ ఆర్ట్స్‌లో శ్వేతకు మంచి పట్టుంది.. ఇవన్నీ చూశాక.. ఆమెను బయటి ప్రపంచం అసభ్యంగా మాట్లాడుతుంటే విని బాధపడ్డానని హైదరాబాద్‌లోని ప్రజ్వల నిర్వాహకులు సునీతాకృష్ణన్ ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
ఇంకా ఆమె శ్వేతను పదే పదే ఆ కోణం నుంచే చూస్తూ బాధపెట్టకండి. ఆమె తిరిగి కొత్త జీవితం మొదలు పెట్టేందుకు తోడ్పాటు ఇవ్వండి. ఆమెకు నైతిక మద్దతు అవసరమని సునీతాకృష్ణన్ సమాజానికి విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu