Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుష్క నవ్వింది... నా ఫేటు మారింది... పోసాని కృష్ణమురళి

అనుష్క నవ్వింది... నా ఫేటు మారింది... పోసాని కృష్ణమురళి
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (17:29 IST)
ఆమె నవ్వింది రాజా.. నా ఫేటు మారింది.. అంటూ పోసాని కృష్ణమురళి అంటున్నాడు. ఇదంతా ఎందుకంటే... వేదం సినిమాలో అనుష్క, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో చేస్తున్నాను. అంతకుముందు నేను రచయితగా, దర్శకుడిగా తెలుసు. కానీ నటుడిగా ఏవో పాత్రలు వస్తున్నాయి. చేస్తూనే వున్నాను. వేదంలో నేను చేసిన పాత్రకు అనుష్క తెగ నవ్వేసింది.
 
మీ మాడ్యులేషన్‌ స్టైల్‌ అద్భుతంగా వున్నాయి. కామెడీ తెప్పిస్తున్నాయంటూ అనుష్క నవ్వేసింది. ఇదే అభిప్రాయాన్ని అల్లు అర్జున్‌ చెప్పాడు. ఇంక ఇద్దరు చెప్పాక.. ఆలోచించాను. ఆ సినిమా విడుదలయ్యాక... చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. రచయితగా ఎప్పుడైనా రాసుకోవచ్చు.. ఇప్పుడు నటుడిగా అవకాశం వచ్చింది. అదే పదివేలని నా భార్య సలహా కూడా తీసుకుని కొనసాగిస్తున్నాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu