Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లుంగీ డ్యాన్స్ ఓకే.. పూనమ్ కౌర్ బెల్లీ డ్యాన్స్ చేసిందట!

లుంగీ డ్యాన్స్ ఓకే.. పూనమ్ కౌర్ బెల్లీ డ్యాన్స్ చేసిందట!
, శుక్రవారం, 19 డిశెంబరు 2014 (16:34 IST)
లుంగీ డ్యాన్స్ అంటే అందరికీ బాగా తెలిసిందే. ఇక బెల్లీ డ్యాన్స్ గురించి తెలుసుకోవాలంటే పూనమ్ కౌర్‌ను అడిగి తెలసుకోవాల్సిందే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఎక్కువగా సంప్రదాయ పాత్రల్లో కనిపించే పూనం కౌర్ తొలిసారిగా బెల్లీ డ్యాన్స్ చేసింది. అందుకే, ఈ విషయాన్ని తను గొప్పగా చెప్పుకుంటోంది.
 
'ఎన్ వయి తనీ వయి' అనే తమిళ సినిమాలో ఈ బెల్లీ డ్యాన్స్ చేసిందట. దీని గురించి పూనం చెబుతూ, "ఇలాంటి డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి. దీనిని జోర్డాన్‌లో షూట్ చేశాం. బృంద మాస్టర్ మంచి డ్యాన్స్ కంపోజ్ చేసి నాతో చేయించింది. బెల్లీ డ్యాన్స్ చేస్తుంటే చాలా ఫన్‌గా అనిపించింది" అంటోంది. తెలుగులో అవకాశాలు లేని ఈ చిన్నది తమిళంలో మాత్రం ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu