Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీదేవి నా ఆరాధ్య దైవం... ఒక్క ఛాన్స్ ఇస్తారా...!

శ్రీదేవి నా ఆరాధ్య దైవం... ఒక్క ఛాన్స్ ఇస్తారా...!
, శనివారం, 20 డిశెంబరు 2014 (11:24 IST)
శ్రీదేవి నా ఆరాధ్య దైవం... ఆమెతో ఒక్క సన్నివేశంలో నటిస్తే చాలు... నా జీవితం ధ్యనమవుతుందంటోంది ఓ వీరాభిమాని. ఆమె ఎవరో కాదు అచ్చ తెలుగమ్మాయి పూనం కౌర్.
 
ఈ అమ్మడు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ దక్షిణాది భాషల్లో నటిస్తున్న మంచి పేరే తెచ్చుకుంది. ఈమెకు ఎవరంటే ఇష్టం అని అడిగితే శ్రీదేవి అంటూ టక్కున సమాధానం ఇచ్చింది.
 
అంతే కాదు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో... మాటల్లో చెప్పలేనంటోందీ బ్యూటీ. శ్రీదేవి, కమల్ హాసన్ నటించిన వసంత కోకిల సినిమాను ఎన్నిసార్లు చూశానో... ఆ చిత్రంలో శ్రీదేవి నటన అద్భుతం. అప్పటి నుంచి తానామెను మరచిపోలేకపోయానంది.
 
ఆమెను అభిమానిస్తాననండ కంటే కంటే కూడా ఆరాధిస్తాననడం కరెక్ట్ అంటోందీ చిన్నది. శ్రీదేవితో ఒక్క సన్నివేశంలో నైనా నటించే అవకాశం రావాలని కోరుకుంటోంది. ఈ బ్యూటీ ఆశ ఫలించాలని మనమూ కోరుకుందాం.

Share this Story:

Follow Webdunia telugu