Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పుడే పెళ్లా... అవన్నీ ఉత్త పుకార్లే.. కొట్టిపారేసిన దీపికా పదుకొనే..

అప్పుడే పెళ్లా... అవన్నీ ఉత్త పుకార్లే..  కొట్టిపారేసిన దీపికా పదుకొనే..
, గురువారం, 21 మే 2015 (12:29 IST)
అప్పుడే పెళ్లా.. అవన్నీ ఉత్త పుకార్లే అంటూ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కొట్టిపారేసింది. వివాహం అనేది చాలా పవిత్రమైనది, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానమైన ఘట్టమని దీపిక చెబుతుంది. పెళ్లి కోసం తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదని అంటున్నది. చాలా కాలంగా బాలీవుడ్ హీరో రణవీర్‌తో ప్రేమాయం సాగిస్తున్న దీపికా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈమేరకు స్పందించింది. ఈ ఇద్దరి పెళ్ళికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నట్లు సమాచారం.
 
ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ…. మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని, అతనితో జీవితాన్ని పంచుకోవడం అనే ఆలోచనే ఓ అపురూపమైన అనుభూతి అని అభివర్ణించింది. పెళ్లి విషయంలో ప్రతి వ్యక్తికి సొంత అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయని, వాటికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకోవాలని అనుకుంటారని తెలిపింది.
 
జీవితంపై ప్రభావం చూపే ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో హడావుడి నిర్ణయం తీసుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల పైనే అని ఈ సమయంలో పెళ్ళికి తొందరపడటం మంచిది కాదని అనుకుంటున్నానని తెలిపింది. సరైన సమయంలోనే పెళ్లికి సంబంధించిన శుభవార్త అభిమానులతో పంచుకుంటానని దీపికా స్పష్టంచేసింది.

Share this Story:

Follow Webdunia telugu