Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐదవ పడిలోకి ఆద్యా... రేణు పార్టీ... పవన్ వస్తారా..?!

ఐదవ పడిలోకి ఆద్యా... రేణు పార్టీ... పవన్ వస్తారా..?!
, శనివారం, 21 మార్చి 2015 (18:15 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి రేణు దేశాయ్ పార్టీ చేస్తుందట. ఆ పార్టీకి పవన్ వస్తారో రారో అంటూ ఆశగా ఎదురుచూస్తుంది. ఇంతకి అసలు విషయం ఏమిటంటే... పవన్, రేణుల ముద్దుల కుమార్తె ఆద్యా మార్చి 23వ తేదిన ఐదవ పడిలోకి అడుగుపెట్టబోతుంది.
 
ఇప్పటికే పవన్, రేణులు భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ, ఇటీవల కొంత కాలంగా మళ్లీ దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది. రేణు దేశాయ్ తన కూతురు కోసం చిన్న పార్టీ చేయాలనీ అనుకుంటుంది. ఈ వేడుకకు పవన్ హాజరు కానున్నాడని సమాచారం. ముద్దుల కూతురు ఆద్యా పుట్టినరోజు గురించి రేణు ట్విట్ చేస్తూ 'బర్త్ డే గర్ల్ సోమవారం 5 యేటలోకి అడుగుపెట్టబోతుంది.
 
ఆధ్యతో షాపింగ్ చేశాను. బర్త్ డే స్పెషల్ డ్రెస్ తీసుకున్నాను' అని ట్విట్ చేసింది. బర్త్ డే పార్టీ భారీగా ఏర్పాటు చేస్తున్నారా అనే ప్రశ్నకి స్పందిస్తూ 'బర్త్ డే పార్టీ పెద్దగా ఏమి చేయడం లేదు. ఇంట్లోనే చిన్నగా ఏర్పాటు చేస్తున్నాం. ఇల్లు లేని వారికి అన్నదానం చేయాలనీ అనుకుంటున్నాం' అని చెప్పింది. అయితే ఈ పార్టీకి పవన్ పవన్ వస్తారా అనే విషయం స్పష్టం చెప్పలేదు. కానీ పవన్ రాక కోసం ఆమె ఆశగా ఎదురుచూస్తున్నట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu