Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'గబ్బర్ సింగ్ 2' వెనక్కి.. పవన్ కళ్యాణ్‌కు పూర్తి విశ్రాంతి!

'గబ్బర్ సింగ్ 2' వెనక్కి.. పవన్ కళ్యాణ్‌కు పూర్తి విశ్రాంతి!
, శనివారం, 31 జనవరి 2015 (13:41 IST)
హీరో పవన్ కళ్యాణ్ పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఇందుకోసం ఆయన 'గబ్బర్ సింగ్ 2' చిత్రం షూటింగ్‌ను వాయిదా వేసుకున్నాడు. 'గోపాల గోపాల' చిత్రం షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో బాధపడ్డారు. దీంతో ఆయనకు ఆరోగ్యం సరిగ్గాలేదని వార్తలు వచ్చాయి. 
 
ఇప్పుడు అందుకు సూచకగా ఆయన విదేశాలకు వెళ్ళి ఆరోగ్యం చెకప్‌ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 'గబ్బర్‌ సింగ్‌-2' చిత్రం చేయాల్సి వున్నా అది వెనక్కువెళ్ళేట్లుగా వుంది. ఈలోగా చిత్ర దర్శకుడు బాబీ మరో సినిమాను చేయడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. 
 
ఫిబ్రవరి రెండోవారంలో ఆయన తన కార్యాలయాన్ని తీసి మరో హీరోతో సినిమా చేయనున్నట్లు తెలిసింది. బాబీ ఇంతకుముందు 'పవర్‌' సినిమా చేశాడు. విశ్రాంతి తర్వాత స్వదేశానికి వచ్చి గబ్బర్ సింగ్ 2 చిత్రాన్ని పూర్తి చేయాలన్న తలంపులో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu