Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి 150వ సినిమాకు.. పవన్ కల్యాణ్‌కు లింకుందట!

చిరంజీవి 150వ సినిమాకు.. పవన్ కల్యాణ్‌కు లింకుందట!
, మంగళవారం, 12 మే 2015 (14:35 IST)
మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు లింకుందని టాలీవుడ్‌లో టాక్ వస్తోంది. ఇదేంటి అనుకుంటున్నారా? అవునండి.. మెగాస్టార్ 150వ సినిమాకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకుడని, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కూడా సెప్టెంబరులో ప్రారంభం కానుందని సమాచారం. 
 
ఇంతకీ సెప్టెంబరులోనే అన్నయ్య సినిమాకు ముహూర్తం ఎందుకు ఖరారు చేశారనే అంశంపై ఆరా తీస్తే.. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కల్యాణ్ బర్త్ డే కావడంతో.. అదే రోజున 150వ మూవీని ప్రారంభించాలనుకుంటున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
మెగా బ్రదర్స్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడానికే.. పవన్ బర్త్ డే రోజున 150వ సినిమాను చిరు ప్రారంభించాలనుకుంటున్నారని తెలిసిందే. తద్వారా మెగా బ్రదర్స్‌పై విభేదాలున్నాయంటూ మీడియా కోడైకూయడానికి చెక్ పెట్టవచ్చునని మెగా ఫ్యామిలీ భావిస్తోంది. చెర్రీ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా ఆరంభోత్సవ వేడుక పవన్ బర్త్ డే రోజునే ఉంటుందని తెలియడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu