Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూతురు కోసం పవన్ కల్యాణ్ స్కూలుకు వెళ్లారట!

కూతురు కోసం పవన్ కల్యాణ్ స్కూలుకు వెళ్లారట!
, మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (12:18 IST)
తన కుమార్తె కోసం పవన్ కల్యాణ్ స్కూలుకు వెళ్లారట. సినిమాలతో బిజీగా ఉన్న పవన్ ఒక్కసారిగా ఆ పనులన్నీ పక్కనబెట్టేసి తన కుమార్తె చదువుకుంటున్న స్కూలుకు వెళ్లాడు. 
 
పవన్- రేణు దేశాయ్‌ల ముద్దుల కూతురు ఆద్యా పూణేలో చదువుకుంటోంది. స్కూలు ఫంక్షన్లో ఆద్యా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించడానికి పవన్ పూణే వెళ్ళాడు. అందుకు సంబంధించిన కూతురు ఫోటోను రేణు తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
 
సంప్రదాయ దుస్తుల్లో కూతురు మిలమిలా మెరిసిపోతూ డ్యాన్స్ చేస్తుంటే, పవన్, రేణు అలాగే చూస్తుండిపోయారట. "మా అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే నోట మాటరాలేదు. భావోద్వేగానికి గురయ్యాను. తండ్రి కూడా అంతే... ఆయన నా కన్నా ఎక్కువ భావోద్వేగానికి లోనయ్యారు" అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu