Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగస్ట్‌ చివరి వారంలో రానున్న 'పాచిక'

ఆగస్ట్‌ చివరి వారంలో రానున్న 'పాచిక'
, గురువారం, 24 జులై 2014 (20:11 IST)
'నా సామిరంగ' ఫేమ్‌ దిలీప్‌కుమార్‌ హీరోగా, దివ్యాసింగ్‌ హీరోయిన్‌గా ఫిల్మ్‌ ట్రేడ్‌గైడ్‌ సమర్పణలో విజ్‌డమ్‌ ఫిల్మ్స్‌ ప్రై||లి|| వి.ఆర్‌.డి.డి.ఆర్ట్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం 'పాచిక'. శశిశంకర్‌ దర్శకుడు. కోవై సరళ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగస్ట్‌ చివరి వారంలో విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... ''నా సామిరంగ' ఫేం దిలీప్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న 'పాచిక' చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నాము. కథ, కథనం, దిలీప్‌ కుమార్‌ నటన, దివ్యాసింగ్‌ అందచందాలు సినిమాకి ప్రధానాకర్షణగా నిలుస్తాయి. 
 
ముఖ్యంగా కోవై సరళ పాత్ర, ఆమె నటన అద్భుతమని చెప్పాలి. ఇటీవలి కాలంలో 'కాంచన' తర్వాత ఆమె ఈ చిత్రంలోనే పూర్తి స్థాయి నిడివిలో నటించింది. ఇక సినిమాను ఎంతో గ్రాండ్‌గా, రిచ్‌గా ఉండడానికి ఆర్‌.ఎఫ్‌.సి, పొల్లాచ్చి, గోవా, పాండిచ్చేరి, కేరళలలోని తదితర అందమైన లొకేషన్లలో భారీగా చిత్రీకరించాము. 
 
దర్శకుడు శశికిరణ్‌ మలయాళంలో చాలా చిత్రాలు చేశాడు. సూర్య, జ్యోతిక నటించిన 'సుందరాంగుడు' చిత్రం ద్వారా తెలుగులో కూడా సుపరిచితులే. ఈచిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌ చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu