Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రస్తుతానికి కెరీర్ సంతృప్తిగానే ఉంది : ప్రణీత

ప్రస్తుతానికి కెరీర్ సంతృప్తిగానే ఉంది : ప్రణీత
, శుక్రవారం, 29 ఆగస్టు 2014 (17:30 IST)
అసలు నేను సినిమాల్లో నిలదొక్కుకుంటానని ఏమాత్రం ఊహించలేదు. వైద్య నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేను బాగా చదువుకొని ఏదో ఒక రంగంలో స్థిరపడాలనే అనుకున్నాను. కానీ మా తల్లితండ్రుల గానీ, నేనుగానీ హీరోయిన్‌ అవుతానని ఎప్పుడూ అనుకోలేదని అంటోంది సొట్టబుగ్గల సుందరి ప్రణీత. 
 
2010లో 'పోర్కి' అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రణీత ఇప్పటికి దాదాపు 12 సినిమాల్లో నటించింది. కానీ 'అత్తారింటికి దారేదీ' అనే సినిమాతో పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత అడపాదడపా సెకండ్‌ హీరోయిన్‌గా ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'రభస' సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ఈనెల 29న విడుదల కానుంది. 
 
ఈ సందర్భంగా ప్రణీత చెబుతూ తన కెరీర్‌ సాగుతున్న తీరుపట్ల చాలా సంతృప్తిగా ఉందని, కన్నడ అమ్మాయినైన తాను అసలు సినిమాల్లోకి వస్తాననే భావించలేదు. నాలుగేళ్ల క్రితం అయితే అసలు తాను ఇక్కడకు వస్తానని కూడా ఎవరూ ఊహించలేదని తెలిపారు. 
 
ఇక్కడన్నీ ప్రయోగాలు చేయడం, అలా వెళ్లిపోవడమేనని వివరించింది. రభస గురించి మాట్లాడుతూ..'ఈ సినిమాలో మాస్‌ కావాల్సిన అన్ని అంశాలున్నాయి. ఎన్టీఆర్‌ అద్భుతమైన నటుడు. ఆయన డాన్స్‌ చేస్తుంటే అలా చూస్తు ఉండిపోవాల్సిందేనని ఎన్టీఆర్‌ను తెగ పొగుడుతోందీ భామ. 

Share this Story:

Follow Webdunia telugu