Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్ వారసుడు కృష్ణుడు పుట్టిన నక్షత్రంలో పుట్టాడట!

ఎన్టీఆర్ వారసుడు కృష్ణుడు పుట్టిన నక్షత్రంలో పుట్టాడట!
, మంగళవారం, 22 జులై 2014 (15:08 IST)
జూనియర్ ఎన్టీఆర్ వారసుడు కృష్ణుడు పుట్టిన నక్షత్రంలో పుట్టాడట. నందమూరి వంశంలోకి ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణీతల ముద్దుల సంతానంగా అడుగుపెట్టిన ఈ వారసుడు శ్రీ కృష్ణ భగవానుడు పుట్టిన రోహిణి నక్షత్రంలో పుట్టాడు. ఈ బుజ్జి కృష్ణుడి రాకతో నందమూరి ఇంట మరింత సంతోషాలకు కొదవ ఉండదని పంచాంగ కర్తలు అంటున్నారు. ఈ చిన్ని కృష్ణుడి రాకతో ఎన్టీఆర్‌కు అదృష్టం కలిసొస్తుందని అందరూ అనుకుంటున్నారు.  
 
అంతేగాకుండా చిన్ని కృష్ణయ్యగా ఎన్టీఆర్ తనయుడు పుట్టిన సమయం కుటుంబంలో నెలకొన్న విబేధాలు తొలగిపోవచ్చునని పంచాంగ కర్తలు, అభిమానులు అనుకుంటున్నారు.
 
సాధారణంగా రోహిణి నక్షత్రంలో పుట్టిన పురుషులు ఎలా ఉంటారంటే..?
ఇతరులను ఆకట్టుకునే అందాన్ని కలిగివుంటారు. ఆజానుబాహులై వుంటారు. అందమైన కళ్లు, విశాలమైన భుజాలు కలిగివుంటారు. తన అందంతో ఇతరులను ఇట్టే ఆకర్షించుకునే వారిగా వుంటారు. ఇతరులకు సాయం చేసే స్వభావం కలిగివుంటారు. ఉన్నత స్థాయిలో ఉంటారు. అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu