Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

350 మంది అమ్మాయిలకు ముద్దులతోనే అంబరీష్ సరిపెట్టారా?!!

350 మంది అమ్మాయిలకు ముద్దులతోనే అంబరీష్ సరిపెట్టారా?!!
, శుక్రవారం, 19 డిశెంబరు 2014 (09:29 IST)
తాను ఇప్పటి వరకు 350 మంది అమ్మాయిలకు ముద్దులు పెట్టినట్టు సినీ నటుడు, కర్నాటక మంత్రి అంబరీష్ వెల్లడించారు. అయితే, ఆ అమ్మాయిలకు కేవలం ముద్దులతోనే సరిపుచ్చుకున్నాడా లేదా అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
గతంలో ఓ అమ్మాయిని అంబరీష్‌ ముద్దుపెట్టిన ఫొటోపై ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ బార్‌లో మందుకొట్టి, హిందీ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ అంబరీష్ కెమెరాకు చిక్కిన సంగతి తెలిసిందే. 
 
ఇది తన వ్యక్తిగతమని ఆయన వాదిస్తున్నారు. అయితే, ఇలా మందుకొట్టి మజా చేసే మంత్రి రూ.1.22 కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి సింగపూర్‌లో వైద్యం చేయించుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 
 
ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఈ కన్నడ మంత్రి, నటుడు.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన సింగపూర్‌కు తరలించి చికిత్స చేశారు. ఈ చికిత్స కోసం ప్రభుత్వం రూ.1.22 కోట్లను వెచ్చించింది. దీనిపై విపక్షాలు తీవ్రమైన విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu