యంగ్ హీరో నితిన్ తాను పవన్ కల్యాణ్‌కి పెద్ద అభిమాని అని తెలిసిందే. ప్రతి నితిన్ సినిమాలోనూ పవన్ కల్యాణ్ నామ స్మరణ లభిస్తుంది. నితిన్ తాజాగా నటించిన 'చిన్నదాన నీ కోసం' సినిమాలో తాను పవన్ అభిమాని పాత్రను పోషించానని చెప్పాడు.
'తొలిప్రేమ' సినిమా చూసినప్పటి నుంచీ తాను పవన్‌కు ఫ్యాన్‌గా మారాననీ, ఆయన స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చాననీ, అందుకే తన ప్రతి సినిమాలో పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావన ఉంటుందనీ చెప్పాడు.
ఈ నెల 25న రిలీజవుతున్న తన తాజా చిత్రం మంచి హిట్టవుతుందని నితిన్ అన్నాడు. ఈ 'చిన్నదాన నీ కోసం' ఆడియో డిస్క్ వేడుక ఆదివారం రాత్రి తిరుపతిలో జరిగింది. ఆ సందర్భంగా పవన్ పట్ల తన అభిమానాన్ని నితిన్ ఇలా చాటుకున్నాడు.