Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీలకంఠ 'మాయ' ముగింపు ట్విస్ట్‌ ఓకే!

నీలకంఠ 'మాయ' ముగింపు ట్విస్ట్‌ ఓకే!
, గురువారం, 31 జులై 2014 (18:27 IST)
షో, మిస్సమ్మ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'మాయ'. ఈ చిత్రం ఆగస్టు 1న విడుదలవుతుంది. ఈ చిత్రాని రెడ్డి, శ్రీధర్‌రెడ్డి నిర్మాతలు. ఇందులో కాన్సెప్ట్‌... చిన్నతనంలోనే సిక్త్‌ సెన్స్‌ ఎక్కువగా వున్న అమ్మాయి కథ. చిన్నతనంలోనే అమ్మ చనిపోతుందని తెలిసినా.. చెప్పలేని తత్వం. 
 
కానీ పెరిగేకొద్దీ... ముందుగా జరగబోయేవి చెప్పేస్తుంది. వాటిల్లో ఒకటి రెండు కాపాడుకుంటుంది. అయితే ఓ సంఘటన ముందుగా జరగబోయేది తన జీవితానికే అడ్డంకిగా మారుతుంది. దాన్ని ఎలా సాల్వ్‌ చేసుకుంది? అనేది సినిమా.
 
సుష్మారాజ్‌ ఈ పాత్రను పోషించింది. మోడల్‌ కమ్‌ హీరోగా హర్షవర్ధన్‌ రాణే నటించాడు. దర్శకుడు మొదటి భాగమంతా పేలవంగా చిత్రించాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రెండో భాగం చివర్లో అసలు కథ ఏమిటో తెలుస్తుంది. అయితే ఇలాంటి తరహా ట్విస్ట్‌లు గతంలో వచ్చినా... సెకండాఫ్‌లో ముందు ఏం జరుగుతుందో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఇలాంటి చిత్రాలు కామన్‌‌మేన్‌ను ఆకర్షించడం కష్టమైనా... టోటల్‌గా ఫర్వాలేదనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu