Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లికి సిద్ధమవుతున్న నయన.. మాజీ నటి కుమారుడే వరుడా..?

పెళ్లికి సిద్ధమవుతున్న నయన.. మాజీ నటి కుమారుడే వరుడా..?
, గురువారం, 23 ఏప్రియల్ 2015 (18:36 IST)
దక్షిణాది చిత్ర పరిశ్రమలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందాల తార నయనతార. ఆ పేరు ఆమె నటించే సినిమాలకి సంబంధించిన వార్తల్లో కన్నా, తన లవ్ ఎఫైర్స్ కి సంబంధించిన వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. ఎప్పుడూ ప్రేమ వివాదాల్లో ముందుండే నయనతార త్వరలో పెళ్లి పీఠలెక్కబోతుందట. ఈ వార్త విని ఆశ్చర్యపోనివాళ్లుండరంటే అతిశయోక్తి కాదు.
 
అయితే ఈ అందాల రాశిని మనువాడే వరుడు ఎవరా అంటూ మతిని తొలిచేస్తుంటుంది. ఆ వరుడు తమిళ చిత్రపరిశ్రమకి చెందిన ఓ మాజీ నటి కుమారుడేనట. ఈ విషయం ఆమె సన్నిహితుల ద్వారానే బయటికి వచ్చిందనే వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఈ వార్త మరింత ప్రాధాన్యతను సంతరించుకుని, అభిమానులని ఆలోచించేలా చేస్తోంది.
 
పెళ్లీడు కొచ్చిన కొడుకున్న ఆ తమిళ నటి ఎవరో అనే ఆలోచన ఇప్పుడు అందరిలోను రేకెత్తుతోంది. మామూలుగానే కెరియర్ పీక్‌లో ఉన్నప్పుడు ఏ హీరోయిన్ పెళ్లి మాట ఎత్తదు. అటువంటిది చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న నయనతార పెళ్లి చేసుకుంటారా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తుంటే, మరి కొందరు మాత్రం ప్రియుడితో పెళ్లికి సిద్ధమై, సినిమాలకు బాయ్ బాయ్ చెప్పిన నయన ఇప్పుడు మాత్రం కాదంటుందా అని అంటున్నారు. మరి వేచి చూడాల్సిందే.
 

Share this Story:

Follow Webdunia telugu