Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ. మూడు కోట్లు ఇస్తేనే చిరు సరసకు.. నయన డిమాండ్..?

రూ. మూడు కోట్లు ఇస్తేనే చిరు సరసకు.. నయన డిమాండ్..?
, ఆదివారం, 24 మే 2015 (18:38 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ తారగా వెలుగుతున్న బ్యూటీ నయనతార. వ్యక్తిగత జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఒడిదుడుకులు ఎదురైనా అవేవి తన సినీ కెరియర్‌పై దెబ్బపడకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ తన సెకండ్ ‌ఇన్నింగ్‌లోనూ దూసుకుపోతున్న ఈ బ్యూటీకి వయసు పెరుగుతున్నా, డిమాండ్ మాత్రం తగ్గనంటోంది. 
 
తమిళనాట ఎడాపెడా సినిమాలు చేసేస్తూ బిజీగా వున్న ఈ ముద్దుగుమ్మను చిరంజీవి నటించే 150వ చిత్రానికి ప్రధాన కథానాయికగా అడిగారట. అందుకు వెంటనే అంగీకరించిన నయన పారితోషికం దగ్గర బాంబు పేలినంత పని చేసింది. ఏకంగా మూడు కోట్లు ఇస్తేనే అందులో నటిస్తానని మొహమాటం లేకుండా చెప్పేసిందనీ, దాంతో సదరు చిత్ర దర్శక నిర్మాతలు షాక్ తిన్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. 
 
మరి, ఈ విషయంలో వాస్తవాలు ఏమిటన్నది తెలియాల్సివుంది. ఇదిలా వుండగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్, బండ్ల గణేష్ కలసి సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో రెండో కథానాయికగా అంజలి నటిస్తుందని అంటున్నారు. చిరంజీవి జన్మదినమైన ఆగష్టు 22న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించి, సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu