Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారా రోహిత్ సావిత్రి : ఓ ఫ్యామిలీ డ్రామా ఎలా వుంటుంది?

నారా రోహిత్ సావిత్రి : ఓ ఫ్యామిలీ డ్రామా ఎలా వుంటుంది?
, మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (15:29 IST)
సావిత్రి ... ఇది నారా రోహిత్ నటించే తదుపరి సినిమా టైటిల్. ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నాడు. 'ప్రేమ ఇష్క్ కాదల్' పేరిట లవ్ స్టోరీ తీసిన పవన్ ఇప్పుడీ చిత్రానికి భిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు.
 
రోహిత్‌తో తీస్తున్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీ డ్రామా కథతో తెరకెక్కిస్తున్నానని దర్శకుడు అన్నారు. దీని గురించి పవన్ చెబుతూ "నా తదుపరి చిత్రాన్ని నారా రోహిత్ తో చేస్తున్నాను. నా మొదటి సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కాగా ... ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామాతో సాగుతుంది. 'సావిత్రి' అనే టైటిల్ ఖరారు చేశాం" అంటూ ట్వీట్ చేశాడు.
 
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయనీ, డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెడతామనీ పవన్ తన పోస్టులో పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu