Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాగచైతన్యకు పెళ్లి కళ అప్పుడొస్తుందట... ఇప్పుడు సమాజం అంటున్నాడు...

నాగచైతన్యకు పెళ్లి కళ అప్పుడొస్తుందట... ఇప్పుడు సమాజం అంటున్నాడు...
, మంగళవారం, 19 ఆగస్టు 2014 (18:13 IST)
అక్కినేని నాగచైతన్యకు పెళ్లి బాజా మోగే సమయం వచ్చేసినట్లుంది. ఎందుకంటే ఇప్పటికే ఇంటిలో పెండ్లి గురించి చర్చ జరుగుతోందట. ఈ విషయాన్ని ఆయన చెప్పేస్తున్నాడు. 'ఒక లైలా కోసం' చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రమోషన్‌లో భాగంగా బయటకు వచ్చిన ఆయన్ను మీ నిజజీవితంలో ఆ ఘడియలు ఎప్పుడంటే.. ఇలా బదులిచ్చాడు. 
 
ఇంకా నాకు ఆ వయస్సు రాలేదు, ఇంకా రెండేళ్ళు పడుతుంది. ఇటీవలే నాన్నగారు మీలో ఎవరు కోటేశ్వరుడు కాన్సెప్ట్‌ చూశాక... సమాజంలో చాలా విషయాలు తెలిశాయి. పేపర్లలో మరిన్ని తెలుసుకున్నాను. సమాజంలో ఎన్ని తేడాలున్నాయో గమనించాను. భవిష్యత్‌లో సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచన వుందని చెబుతున్నాడు. పెళ్లి గురించి సమాజం గురించి మాట్లాడుతున్నాడంటే రాజకీయాల్లోకి వస్తాడా ఏంటి...?

Share this Story:

Follow Webdunia telugu