Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాగ చైతన్య సినిమాకు ''దోచేయ్'' టైటిల్ ఖరారు!

నాగ చైతన్య సినిమాకు ''దోచేయ్'' టైటిల్ ఖరారు!
, బుధవారం, 10 డిశెంబరు 2014 (14:22 IST)
అక్కినేని నాగచైతన్య, కృతిసనన్‌ జంటగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రానికి 'దోచెయ్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్‌‌ను దోచెయ్‌గా రిజిష్టర్ చేశారు. 
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరింది. ఇందులో మోసం చేసే వారిని ఘరానా మోసంతో దెబ్బ కొట్టే యంగ్ డైనమిక్ యువకుడిగా చైతూ నటిస్తున్నాడు. 
 
అందుకే, ఈ చిత్రానికి 'దోచెయ్' అనే టైటిల్ కరెక్టుగా సెట్ అవుతుందని  నిర్ణయించినట్టు సమాచారం. ఈ చిత్రంలో చైతూ సరసన కృతి సనాన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu