Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోవడం నా నైజం : మోహన్ బాబు

ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోవడం నా నైజం : మోహన్ బాబు
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (11:00 IST)
ప్రజలకు కష్టనష్టాలు వచ్చినప్పుడు నటుడిగా ముందుండి వారిని ఆదుకోవడం తనకు అలవాటని సినీనటుడు, శ్రీవిద్యానికేతన్‌ విద్యా సంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ ఎం.మోహన్‌బాబు చెప్పుకొచ్చారు. సోమవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలోని శ్రీవిద్యానికేతన్‌ కళాశాలలో ఆయన మాట్లాడారు. 
 
తుఫాను వంటి విపత్తులు ప్రపంచంలో ఎవరికీ రాకూడదని తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. తెలుగు భాష మాట్లాడే ప్రజలందరూ బాధ్యతగా తుఫాను బాధితులకు సాయం అందించాలన్నారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్సులో ఉండి రేయింబవుళ్లు కష్టపడటం అభినందించదగ్గ విషయమన్నారు.
 
ఇకపోతే.. తన కుమారుడు, సినీహీరో మనోజ్‌, స్నేహితులు కలిసి సుమారు 30 లక్షలు వరకు తుఫాన్‌ బాధితుల కోసం సాయం చేశారన్నారు. శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల సిబ్బంది మొత్తం ఒక్క రోజు వేతనం తుఫాను బిధితులకు విరాళంగా ఇస్తున్నట్టు మరో తనయుడు, హీరో విష్ణు చెప్పారని తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల దగ్గర కూడా విరాళాలను సేకరించి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు పంపనున్నట్లు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu