Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమన్నా ఖాతాలో మరో ప్లాప్.. మహేష్ గుండెల్లో గుబులు!

తమన్నా ఖాతాలో మరో ప్లాప్.. మహేష్ గుండెల్లో గుబులు!
, శనివారం, 21 జూన్ 2014 (14:03 IST)
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చిచేరింది. బాలీవుడ్‌లో కూడా తన ప్లాప్ సెంటిమెంట్ రిపీటైంది. తాజాగా ఆమె నటించిన ''హమ్‌షకల్స్'' అనే బాలీవుడ్ మూవీ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. విడుదలైన మొదటిరోజే ఏవరేజ్ టాక్‌తో పూర్ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. దీంతో బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి రెండో ప్లాప్ నమోదైంది.

ఆమె నటించిన మొదటి సినిమా ''హిమ్మత్‌వాలా'' పరాజయం చవిచూసినా దర్శకుడు షాజిద్ ఖాన్ మరో అవకాశం ఇచ్చి ''హమ్‌షకల్స్''లో పెట్టుకున్నాడు. ఇది కూడా ప్లాప్ కావడంతో తమన్నాకు బాలీవుడ్‌‍లో అవకాశాలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా ప్లాప్ కావడంతో సూపర్‌స్టార్ మహేష్ బాబుకు బెంగపట్టుకుంది. ఆయన నటిస్తున్న ఆగడు సినిమాలో తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకి కూడా తమన్నా ప్లాప్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందేమోనని మహేష్ బయటపుడుతున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu