Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు మనోజ్ పెళ్లాడబోయే అమ్మాయి ఫోటో

మంచు మనోజ్ పెళ్లాడబోయే అమ్మాయి ఫోటో
, సోమవారం, 2 మార్చి 2015 (16:27 IST)
మోహన్ బాబు ద్వితీయ పుత్రుడు మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. విరానికా మిత్రురాలైన ప్రణతి రెడ్డిని మనోజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. మార్చి 4, ఉదయం 10.30 గంటలకు వీరి ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయింది. అట్టహాసంగా ఈ వేడుక జరుగబోతోంది.
 
ప్రణతి రెడ్డిని మనస్ఫూర్తిగా ప్రేమించిన మనోజ్.. ఆమే తన దేవత అని కొనియాడాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కొడుకు మంచు మనోజ్ పెళ్లికొడుకవుతున్న నేపథ్యంలో.. తన ప్రేమ విషయాన్ని సడన్‌గా వెల్లడించి మంచు మనోజ్ అందరినీ ఆర్చర్యంలో ముంచెత్తాడు. 
 
మార్చి 4న మనోజ్, ప్రణతిల నిశ్చితార్థం జరగబోతోంది. ఇన్ని రోజులు ప్రణతి పేరు వినడమే కాని, ఆమె ఫొటోను మాత్రం చూడలేకపోయాం. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఆమె ఫొటోను ట్విట్టర్లో పెట్టారు. ఈ సందర్భంగా, ఈమే నా దేవత అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. ఈమె పేరు ప్రణతి... నా చిన్న కుమారుడికి కాబోయే భార్య... ఇకపై తన మూడో కూతురు అంటూ మోహన్ బాబు స్పందించారు.

Share this Story:

Follow Webdunia telugu