Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు మనోజ్ పెళ్ళి.. ఇప్పుడేంటి ఎప్పుడో కన్ఫమ్

మంచు మనోజ్ పెళ్ళి.. ఇప్పుడేంటి ఎప్పుడో కన్ఫమ్
, ఆదివారం, 25 జనవరి 2015 (22:45 IST)
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కుమారుడు, కథానాయకుడు మంచు మనోజ్ తన ఇష్టపడిన ప్రణతిరెడ్డిని ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నాడని రెండ్రోజుల క్రితం వెబ్ దునియా తెలుగులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పుడు మోహన్‌బాబు కూడా ధ్రువీకరిస్తూ త్వరలో వీరిద్దరి నిశ్చితార్థానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 
 
ప్రణీత ఎవరో కాదు.. మంచు విష్ణు భార్య విరానికకు మంచి స్నేహితురాలు. బిట్స్‌ పిలానీలో ఇద్దరూ కలిసి చదువుకున్నారట. ఆమె ద్వారా ప్రణీత పరిచయమవడం ఇద్దరు కలిసి తిరగడం జరిగిందని సమాచారం. ప్రణీత కుటుంబం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. త్వరలో అంటే ఈ ఏడాదే మనోజ్‌.. ప్యారే మె పడిపోయానే.. అంటూ పాట కూడా పాడుకుంటాడు. కాగా, మనోజ్‌కు పాత్రల విషయంలో అప్పుడప్పుడు తగు సలహాలు కూడా ఇస్తుండేదని తెలిసింది. సో... త్వరలో మనోజ్‌ బయట జోడి కట్టబోతున్నాడన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu