Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు లక్ష్మి ఆనందానికి అవధుల్లేవ్.. ఏడ్చేసింది.!

మంచు లక్ష్మి ఆనందానికి అవధుల్లేవ్.. ఏడ్చేసింది.!
, బుధవారం, 4 మార్చి 2015 (17:52 IST)
మంచు లక్ష్మి.. మోహన్ బాబు కుమార్తె.  ఈమె తన తమ్ముడు మనోజ్ విష్ణు ఎంగేజ్‌మెంట్ ప్రొగ్రామ్‌లో ఆనందం పట్టలేక ఏడ్చేసింది. పెళ్లి కొడుకు ముస్తాబులో ఉన్న తమ్ముడిని చూసి కన్నీరు పెట్టుకుంది. సినీ నటుడు మోహన్ బాబు, నిర్మల దంపతులకు ముగ్గురు పిల్లలు, లక్ష్మీ ప్రసన్న, విష్ణు, మనోజ్. వీరిలో విష్ణుకు విరానికాతో వివాహం జరిగింది. ఆ దంపతులకు అరియానా, వివియానా అనే కవలలు జన్మించారు.
 
వీరి ఆలనాపాలనలో లక్ష్మిదే సింహభాగం. విరానికా స్నేహితురాలు ప్రణతిరెడ్డితో ప్రేమలో పడిన చిన్న తమ్ముడు మనోజ్ నిశ్చితార్థం పార్క్ హయత్ హోటల్‌లో వైభవంగా జరిగింది. చిన్ననాటి నుంచి అనుబంధం ఎక్కువున్న మనోజ్ నిశ్చితార్దం కావడంతో లక్ష్మి కదిలిపోయింది. భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. అక్కను పొదివిపట్టుకుని విష్ణు ఓదార్చడం వేదికలో భాగమైన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

Share this Story:

Follow Webdunia telugu