Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు ఫ్యామిలీ కబడ్డీ: తారలంతా కబడ్డీ ఆడితే..?

మంచు ఫ్యామిలీ కబడ్డీ: తారలంతా కబడ్డీ ఆడితే..?
, గురువారం, 20 నవంబరు 2014 (11:42 IST)
మంచు ఫ్యామిలీయే కాదు.. తారలంతా కబడ్డీ ఆడితే ఎలా వుంటుంది అదిరిపోతుంది కదూ.. అలాంటి మ్యాచే జరగనుంది. అయితే ఇది ఫన్ కోసం కాదు.. హుదూద్ తుఫాను బాధితుల కోసం.. ఉత్తరాంధ్రను కుదిపేసిన తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ చేబడుతున్న 'మేము సైతం' ప్రోగ్రాంలో వివిధ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. 
 
ఈ నెల 30న ఈ కార్యక్రమాలు నాన్ స్టాప్‌గా జరుగుతాయి. పలువురు తారలు, దర్శకులు, నిర్మాతలు పాల్గొనే ఈ వేడుకలో పలు డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్, స్కిట్స్, క్రికెట్, తంబోలా వంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి. 
 
అలాగే, మంచు వారి ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరంతా కలసి కబడ్డీ ఆటను ప్లాన్ చేస్తున్నారట. వీరితో బాటుగా పలువురు హీరోలు, హీరోయిన్లు ఈ కబడ్డీ ఆటలో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu