Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఆగడు' ట్రైలర్‌కు విశేష స్పందన... ఫ్యాన్స్‌కు మహేష్ థ్యాంక్స్!

'ఆగడు' ట్రైలర్‌కు విశేష స్పందన... ఫ్యాన్స్‌కు మహేష్ థ్యాంక్స్!
, సోమవారం, 2 జూన్ 2014 (12:05 IST)
'దూకుడు' దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంతో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'ఆగుడు' ఫస్ట్‌లుక్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ కృష్ణ గారి బర్త్‌డే సందర్భంగా రీలీజ్ చేసిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోంది. పోలీస్ ఆఫీసర్‌గా మహేష్ బాబు చెబుతోన్న పంచ్ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఫస్ట్‌లుక్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మహేష్ బాబు తన ట్విట్టర్‌లో అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. 'ఆగడు' టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, 14 రీల్స్ టీమ్‌కీ, ప్రియమైన డైరెక్టర్ శ్రీను వైట్లకీ థ్యాంక్స్ అని మహేష్ ట్వీట్ చేశాడు. ఇక అభిమానులకి బిగ్ థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu