Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేష్ బాబు గ్లామర్‌ రహస్యమదేనట!

మహేష్ బాబు గ్లామర్‌ రహస్యమదేనట!
, శుక్రవారం, 30 మే 2014 (11:42 IST)
గ్లామర్‌ ఫీల్డులో హీరోయిన్లు గ్లామర్‌ను మెయింటెన్‌ చేస్తూ ఉంటారు. 20ఏళ్ళనాడు చూసినా అదే పర్సనాలిటీ అలాగే  ఉండే దర్శకులూ ఉన్నారు.

హీరోలుకూడా ఉన్నారు. సుమన్‌, శ్రీహరి అలవాటి కోవలోకి వస్తారు. నాగార్జునకూడా గ్లామర్‌ మెయిన్‌టేన్‌ చేస్తారు. అయితే వారంతా ఆహారవిషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. 
 
మహేష్ బాబు విషయంలో రూఢీ అయింది. కొంతమంది హీరోలు షూటింగ్‌లకు వంటగాళ్ళుకూడా వస్తుంటారు. సెపరేట్‌గా వారు చేసిన వండిన పదార్థాల్ని తింటుంటారు.

ఇంటి దగ్గరనుంచి వచ్చిందని చెబుతూంటారు. అదే రహస్యం. ఇటీవల ఆగడు షూటింగ్‌లో మహేష్‌కు ఓ వంటవాడు వచ్చాడు. 
 
లోకల్‌లో షూటింగ్‌ జరుగుతుంటే అతను ఎవరో తెలీలేదు. కానీ ఔట్‌డోర్‌లో జరుగుతుండగా వచ్చి సెపరేట్‌గా వంటకాలు చేసి తినిపించాడు. దగ్గరుండి ఎంత తినాలో, ఏం తినకూడదో భార్య నమ్రత చెబుతుంటుంది. వ్యాయాయానికి ఓ కోచ్‌, వంటకు చెఫ్‌.. ఇలా తమ గ్లామర్‌ ఫీల్డులో తమను తాము కాపాడుకోవడానికి హీరోలు ప్రయత్నాలు చేస్తుండడంలో తప్పులేదుకదా. ఇదే  మహేష్ బాబు గ్లామర్ రహస్యమా..?

Share this Story:

Follow Webdunia telugu